పక్కగా భూమి యొక్క నక్ష, మ్యాప్, హద్దుల నిర్ణయం పటిష్టంగా భూ రికార్డులు భూమి ఆక్రమణలకు తావు లేకుండా భూ భారతి భూ రీసర్వే (land resurvey) కార్యక్రమం జిల్లాను భూ తగాదాలు లేనీ జిల్లాగా తీర్చిదిదలని, ప్రతి భూ కమతానికి సరైన నక్షను, మ్యాప్ ను, హద్దులను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం కోసం మెదక్ మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీ అయిన పాషాపూర్ లో బుధవారం గ్రామసభ నిర్వహించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కోసం నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ నగేష్, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు లు పాల్గొన్నారు.
Read also: Chemical mafia on crops : పంటలపై రసాయన మాఫియా పంజా!

Collector Rahul Raj
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యల పరిష్కారం అవుతుందని తెలిపారు. పాషాపూర్ గ్రామంలో భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించుకోవడానికి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు పక్కగా భూ హద్దులు, భూమి యొక్క నక్ష, మ్యాప్ లను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులను తయారు చేయడమే అని అన్నారు. ప్రతి కమతానికి రీసర్వే చేసి రైతులకు భూ తగాదాలు లేకుండా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. డిజిటల్ సర్వే తో హద్దుల నిర్ణయించి ,అక్షాంశ రేఖాంశాలతో సర్వే చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..
ఈ సర్వే తో భూ హద్దులు చెరిగి పోకుండా ఉంటాయని, భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఉంటుందన్నారు. ఈ రీసర్వే అనంతరం రైతులు భూమిని ఎక్కడకు వెళ్లిన లేదా విదేశాల్లో సైతం తన భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. తర్వాత రోజుల్లో ఈ గ్రామాన్ని నమూనాగా తీసుకొని జిల్లాలోని మరో 23 గ్రామాల్లో భూ భారతి భుముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న భూములాన్ని రీసర్వే చేసి భూమి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్… ప్రజలు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: