కొత్తగా రాబోతున్న ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు- 2025’ ఈ నకిలీ దందాకు చరమగీతం పాడుతుం దా?. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మార్కెట్మా యా జాలం మరోవైపు, నకిలీ విత్తనాలు ఇంకో రైతును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు, నకిలీ పురుగుమందుల విషం సాగును లోపలనుంచే మెల్లగా చంపేస్తోంది. పంటను కాపాడాలన్న రైతు ఆందోళననే పెట్టుబడిగా మార్చుకుని, రసాయన మాఫియా (Chemical mafia on crops) లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ ప్రమాదకర దందాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కాలం చెల్లిన పాత చట్టాల స్థానంలో,పురుగు మందుల నిర్వహణ బిల్లు-2025ను ప్రతిపాదించి, నకిలీ తయారీ దారుల ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి వ్యవసాయంలో పురుగుమందుల వినియోగం ఒక అవసరం కాదు – రైతుకు ఒక అత్యవసర పరిస్థితిగా మారిపోయింది. పంటలో చిన్న తెగులు, పురుగు కనిపించినా, మొత్తం పంట నాశనం అవుతుందేమో అన్న భయం రైతును వెంటాడు తుంది. అదే భయాన్ని అవకాశంగా మలుచుకుని, కొన్ని కంపెనీలు నాణ్యత లేని రసాయనాలను ఆకర్షణీయమైన ప్యాకింగ్లతో మార్కెట్లోకి నెట్టేస్తున్నాయి. నిపుణుల అంచ నాల ప్రకారం, దేశంలో ఏటా రూ. 6,000 – 8,000 కోట్ల వరకు నకిలీ పురుగుమందుల వ్యాపారం సాగుతోంది.
Read Also: http://Parliament Budget Sessions 2026: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అన్న ప్రధాని మోదీ!

రైతు పెట్టే పెట్టుబడిలో దాదాపు 25 శాతం నేరుగా నష్టంగా మారుతోందన్నది చేదు నిజం. నకిలీ పురుగుమందుల ప్రభావం రైతు జేబుతోనే ఆగిపోవడం లేదు. వ్యవసాయ వ్యవస్థ మొత్తం దీనివల్ల దెబ్బతింటోంది. రోగాలు తగ్గకపోగా పంట ఎండి పోవడం, పెరుగుదల ఆగిపోవడం దిగుబడులు పడిపోవడంతో రైతు అప్పుల ఊబిలోకి జారుకోవడం. భూసారం క్రమంగా నాశనంకావడం, భూగర్భజలాలు, పర్యావరణం కలుషితం కావడం ఇవే కాకుండా, పిచికారీ సమయంలో సరైన రక్షణ లేకపోవడం వల్ల రైతుల్లో శ్వాసకోస వ్యాధులు, చర్మసమస్యలు పెరుగుతున్నాయి. చివ రికి ఆ విషపదార్థాలే మన ఆహారంలోకి చేరి సామాన్యుడి ఆరోగ్యానికీ ముప్పుగా మారుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ౧౯౬౮ నాటి కీటక నాశిని చట్టం నేటి పరిస్థితులకు సరిపోవడం లేదు. నామమాత్రపుజరిమానాలు, బలహీన శిక్షలు నకిలీ మాఫియాకు ఎలాంటి భయం కలిగించలేకపో యాయి. ఈ లోపాలను సరిదిద్దేందుకే కేంద్ర ప్రభుత్వం పురుగుమందుల నిర్వహణబిల్లు- 2025 ను తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ఫిబ్రవరి 4లోపు అభిప్రాయాలు, సూచనలు పంపాలని కేంద్రం కోరింది. వ్యవసాయ రంగంలో తిష్టవేసిన నకిలీ మాఫియా అంతానికి ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ నూతన నిబంధనలు అన్నదాతకు కొండంత అండగా నిలు స్తున్నాయి. నకిలీలేదా నిషేధిత పురుగు మందుల తయారీ, విక్రయాలే లక్ష్యంగా విధిస్తున్న నూ. 50లక్షల గరిష్ఠ జరిమానా, ఐదేళ్ల జైలుశిక్ష వంటి నిబంధనలు అక్రమార్కుల గుండె ల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇది కేవలం శిక్షమాత్రమే కాదు, నకిలీల సామ్రాజ్యాన్ని వేళ్లతోసహా పెకిలించే గట్టి హెచ్చరిక. క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రేసిబిలిటీ వ్యవస్థ ద్వారా ప్రతి బాటిల్ ప్రయాణాన్ని తయారీ కేంద్రం నుండి రైతు పొలం వరకు డిజిటల్ పద్దతిలో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈసాంకేతిక అడ్డుకట్టతో సరఫరా గొలుసులో నకిలీలు ప్రవే శించే అవకాశమే లేకుండా పోతుంది.

నాణ్యతలేని మందుల వల్ల పంట నష్టపోతే, రైతు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా కంపెనీలనుంచే పరిహారం పొందే వెసులు బాటు కల్పించడం ఒక విప్లవాత్మక మార్పు. ఇది రైతుకు ఆర్థిక భరోసాతో పాటు చట్టబద్ధమైన రక్షణను నిర్ధారిస్తుంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లం ఘించే డీలర్లు, తయారీదారుల లైసెన్సులను శాశ్వతంగా రద్దుచేసే అధికారం అధికారులకు ఇవ్వడం అభినందనీయం. ఈచర్య వ్యవసాయ ఇన్పుట్ల రంగంలో జవాబుదారీతనాన్ని పెంచి, నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి మార్గం సుగమం చేస్తుంది. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల నియంత్ర ణకు చట్టాలు ఎన్ని కఠినంగా రూపొందించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో రైతు అప్రమత్తతే అన్నింటికన్నా బలమైన రక్షణ కవచం. ప్రతికొనుగోలులోనూ పారదర్శకత ఉండాలి. కంపెనీ పేరు, బ్యాచ్ సంఖ్యస్పష్టంగా నమోదైన ‘పక్కా బిల్లు’ తీసు కోవడం రైతుబాధ్యత మాత్రమే కాదు, మోసపోతే పోరాడేం దుకు ఒక ఆయుధం కూడా. డీలర్ల వ్యాపార ప్రయోజనాల కు ప్రభావితం కాకుండా, వ్యవసాయాధికారులు శాస్త్రీయ సలహాలకు పెద్దపీట వేయాలి. అనవసర రసాయనప్రయోగా లతో (Chemical mafia on crops) సాగును సంక్షోభంలోకి నెట్టుకోకుండా విజ్ఞతతో వ్యవ హరించాలి. ఎక్కడ నకిలీల ఆనవాళ్లు కనిపించినా, వాటిని అధికా రుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తనతో పాటు తోటి రైతుల ప్రయోజనాలను కాపాడే సామాజిక బాధ్యతను ప్రతి కర్షకుడు స్వీకరించాలి. అన్నదాతను పట్టి పీడిస్తున్న నకిలీల బెడదను అరికట్టడం వ్యవస్థల కర్తవ్యమే కాదు, సామాజిక బాధ్యత కూడా. చట్టాల అమలులో కఠినత్వం, కార్పొరేట్ శక్తుల ప్రలోభాల నుంచి రైతుకు రక్షణ కల్పించి నప్పుడే సాగు లాభసాటిగా మారుతుంది. అవగాహనతో కూడిన శాస్త్రీయ సాగు వైపు రైతు అడుగులు వేయడమే ‘రైతే రాజు’ నినాదానికి అసలైన సార్థకత.
-జి. అజయ్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: