हिन्दी | Epaper
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Madhya Pradesh: మహిళను జుట్టు పట్టి కొట్టిన బీజేపీ నేత 

Saritha
Madhya Pradesh: మహిళను జుట్టు పట్టి కొట్టిన బీజేపీ నేత 

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సత్నా జిల్లాలో బీజేపీకి (BJP) చెందిన ఒక నేత చేసిన అరాచకం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక మహిళా బ్యూటీషియన్‌పై బీజేపీ నాగోద్ మండల అధ్యక్షుడు పుల్కిత్ టాండన్ అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాధితురాలిపై భౌతిక దాడి చేయడమే కాకుండా ఆమెను అసభ్యంగా తాకుతూ వేధించారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Budget 2026: సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్ల రాయితీలపై కసరత్తు

మద్యం మత్తులో దాడి

బాధితురాలు సత్నాలో ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. (Madhya Pradesh) మంగళవారం రాత్రి పది గంటల సమయంలో పుల్కిత్ టాండన్ అనుచరుడు ఆర్కే నామ్‌దేవ్ ఆమెకు ఫోన్ చేశాడు. తమ గోడౌన్ వద్ద ఒక కస్టమర్ ఉన్నారని పార్లర్ సర్వీసులు కావాలని ఆమెను నమ్మించి అక్కడికి రప్పించాడు. తీరా ఆమె అక్కడికి వెళ్లాక అక్కడ కస్టమర్లు ఎవరూ లేరని, కేవలం పుల్కిత్ టాండన్ మద్యం సేవిస్తూ ఉన్నాడని గమనించింది. మోసపోయానని గ్రహించి ఆమె తిరిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా పుల్కిత్ ఆమె చేయి పట్టుకుని లాగి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితురాలితో పాటు ఆమె తల్లికి కూడా గాయాలు

Madhya Pradesh: మహిళను జుట్టు పట్టి కొట్టిన బీజేపీ నేత 
Madhya Pradesh: BJP leader beats woman by grabbing her hair.

(Madhya Pradesh) బాధితురాలి ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ఆమె కేకలు విన్న తల్లి, సోదరుడు అక్కడికి చేరుకున్నారు. తన సోదరిపై జరుగుతున్న దాడిని సోదరుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడానికి ప్రయత్నించగా పుల్కిత్ ఆ ఫోన్‌ను లాక్కుని పగులగొట్టాడు. అనంతరం బాధితురాలిపై మద్యం సీసాతో దాడి చేసి, చెంపదెబ్బలు కొట్టాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ తోపులాటలో ఆమె ఒక ఇనుప రాడ్ మీద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలితో పాటు ఆమె తల్లికి కూడా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పార్టీ పరువు గంగలో కలుస్తుందని గ్రహించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాకాంత్ గౌతమ్ నిందితుడైన పుల్కిత్ టాండన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు నమోదు అయినప్పటికీ నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని, అధికార పార్టీ అండతోనే పోలీసులు వెనుకాడుతున్నారని బాధితురాలి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870