తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులకు టీటీడీ (TTD) కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడం, ఫోటోషూట్స్, రీల్స్ చేయడంపై నిషేధం విధించింది. కానీ కొందరు భక్తులు మాత్రం టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. (Tirumala) తాజాగా కొత్తగా పెళ్లైన జంట తిరుమల శ్రీవారి ఆలయం ముందు నుదిటిపై ముద్దులు పెట్టుకుంటూ ఫోటోషూట్ చేయడం వివాదంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్లమండపానికి అతి సమీపంలో ఫొటో షూట్‌లో చేశారు.
Read Also: Breaking news: AP High Court: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురికి బెయిల్

కెమెరామెన్లను తీసుకొచ్చి లైట్లు ఏర్పాటు చేసుకుని మరీ ఈ షూటింగ్ జరిగింది. (Tirumala) ఈ క్రమంలో యువతి నుదుటిపై యువకుడు ముద్దులు పెట్టుకుంటున్న వీడియోలు, ఫొటోలు తీశారు. అక్కడితో ఆగలేదు.. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు నడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఇటువంటివి నిషేధం ఉన్నాయి.. కానీ వీరిని విజిలెన్స్ సిబ్బంది ఎవరూ వీరిని అడ్డుకోలేదు. ఈ ఘటనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా టీటీడీ భద్రతా సిబ్బంది స్పందించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఇలా ఆలయం ముందు ఫోటోషూట్ చేసిన వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: