Konaseema Accident: ఒక చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర (16) అనే విద్యార్థి బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో అమలాపురంలోని తన ప్రైవేట్ కళాశాలకు బయలుదేరాడు.
Read Also: Cyber crime: నకిలీ AI వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు

వివరాల్లోకి వెళితే
ప్రయాణ సమయంలో అన్నంపల్లి టోల్‌ప్లాజా(Toll Plaza) సమీపంలో ఉమ్మి వేయడానికి రవీంద్ర తన తలను కిటికీలోంచి బయటకు పెట్టాడు. అదే సమయంలో బస్సు టోల్‌ప్లాజా గడ్డర్ (ఇనుప స్తంభం)ను దాటుతుండటంతో, ఆ స్తంభం రవీంద్ర తలకు బలంగా తగిలింది. తీవ్రమైన గాయం కావడంతో ఆ కిశోరం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి తండ్రి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కొడుకును చదివిస్తుండగా, ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: