యంగ్ హీరో రోషన్, అనస్వర, అవంతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ (Champion) చిత్రం గత ఏడాది డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత స్వప్న దత్ నిర్మించారు.తెలుగులో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అనస్వర. ముఖ్యంగా ఈ సినిమాలోని గిర గిర సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు.
Read Also: Chandrasekhar: జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ఇప్పుడు ఈ చిత్రానికి ఓటీటీ వేదికగా మరో ఛాన్స్ లభించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమాను తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చింది. నేటి నుంచి (జనవరి 29) ‘ఛాంపియన్’ (Champion) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, లేదా మరోసారి చూడాలనుకునేవారు ఇప్పుడు ఇంట్లో కూర్చునే వీక్షించే అవకాశం లభించింది.
దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రూ.17 కోట్లు మాత్రమే రాబట్టినట్లు టాక్. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, ఈ సినిమాకు మరో హైలెట్ అయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: