భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల (IND vs NZ 4th T20I) మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా నాల్గవ టీ20ఐ మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.
Read Also: AP: మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం
ఈ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఫుల్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు రెస్ట్ ఇచ్చిన టీమిండియా.. ఏకంగా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతోంది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌తో పాటు రవి బిష్ణోయ్‌కి ప్లేయింగ్ 11లో అవకాశం దక్కింది. టీ 20 వరల్డ్‌కప్ ముందు సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావాలనే ఉద్దేశంతోనే ఇషాన్‌ని పక్కనబెట్టి సంజూని కంటిన్యూ చేస్తున్నారు.

భారత జట్టు
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు
డారెల్ మిచెల్, టిమ్ సైఫర్టీ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, జాక్ ఫోక్స్, మిచెల్ శాన్‌ట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, ఇష్ సోడి, జాకబ్ డప్ఫీ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: