
తమిళ స్టార్ హీరో ధనుష్ తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తోమాల సేవలో హీరో ధనుష్ వారి కుమారులు యాత్ర రాజ్, లింగారాజ్ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.వీరికి ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎప్పటిలాగే తన సింప్లిసిటీని చాటుకున్న ధనుష్, పంచె కట్టుకుని సాంప్రదాయ దుస్తుల్లో తన కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన వీడియోలు,ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read Also: Singer: అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ పై స్పందించిన గాయని చిన్మయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: