బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (Budget 2026) ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ‘నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. 10 కోట్ల కుటుంబాలకు కొత్తగా LPG కనెక్షన్లు అందించాం. ప్రపంచంలో ధాన్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచాం. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాం. ఉత్పత్తి రంగంలో అనేక కీలక సంస్కరణలు చేపట్టాం. దీంతో దేశంలో ఎగుమతులు భారీగా పెరిగాయి’ అని తెలిపారు.
Read Also: Plane Crash: అజిత్ పవార్ మృతి పట్ల మమతా బెనర్జీ విచారం
ఫిబ్రవరి 1న బడ్జెట్
“Income ట్యాక్స్ లో కీలక సంస్కరణలు తీసుకొచ్చాం. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించడంతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగింది. ఆధునిక టెక్నాలజీ పవర్ హౌస్ గా భారత్ ను మార్చుతున్నాం.. పీఎం సూర్యఘర్ యోజనతో సాధారణ ప్రజలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని పెంచాం.” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.ఈ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు.. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Budget 2026)ప్రవేశపెట్టనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: