8న నోటిఫికేషన్ జారీ మే 18న పరీక్ష
TS LAWCET 2026: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు లా కాలేజీల్లో 3 సంవత్స రాలు, 5 సంవత్సరాల లా కోర్సులో చేరడానికి నిర్వహించే లాసెట్-2026కి సంబంధించిన దరఖాస్తులను ఫిబ్రవరి 10 నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎల్ఎల్ఎం(LL.M)లో చేరడానికి నిర్వహించే పీజీ లాసెట్-2026 దరఖాస్తులను కూడా ఫిబ్రవరి 10 నుంచే ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 8న జారీ చేయనున్నట్టు లాసెట్, పీజీ లాసెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also:AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత

లాసెట్, పీజీ లాసెట్ 2026 తేదీలు ఖరారు
లాసెట్, పీజీ లాసెట్-2026 కమిటీ సమావేశం మంగళవారం మాసబ్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, లాసెట్, పీజీలాసెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం లాసెట్, పీజీ లాసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు.
ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 13 దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు. మే 18న ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి 12.30 గంటల నుంచి 2 గంటల వరకు 3 సంవత్సరాల లా కోర్సులో చేరడానికి పరీక్షను నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు 5 సంవత్సరాల లా కోర్సు తోపాటు, ఎల్ఎల్ఎంలో చేరడానికి పరీక్షను నిర్వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: