మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (Ajit Pawar) మృతి చెందడంతో రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో మోదీ, అమిత్ షా మాట్లాడారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. బారామతి వద్ద ల్యాండ్ అవుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా నలుగురు మృతి చెందారు.
Read Also: Govt Jobs:స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు
ల్యాండింగ్ అవుతుండగా అదుపుతప్పి కూలిపోయింది
విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది. బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరిన విమానం, 8.45 గంటలకు గంటల సమయంలో బారామతి వద్ద ల్యాండింగ్ అవుతుండగా అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలముకున్నాయి. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల నేపథ్యంలో బారామతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన (Ajit Pawar) వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మూడు మృతదేహాలను బారామతి మెడికల్ కాలేజీకి తరలించామని, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పుణె ఎస్పీ తెలిపారు. డీజీసీఏ అధికారుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
అజిత్ పవార్ ఎవరు?
అజిత్ పవార్ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) సీనియర్ నేతగా గుర్తింపు పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: