ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ సింగర్ (Singer) లలో ఒకరైన అర్జిత్ సింగ్ ఇకపై ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించడం సంగీత ప్రియులను భావోద్వేగానికి గురిచేసింది. ఎన్నో మధుర గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న అర్జిత్ , ఇకపై కొత్త ప్రాజెక్టులు ఏవీ స్వీకరించబోనని స్పష్టం చేయడంతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లినట్లైంది.
Read Also: AR Rahman : రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన
నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు
సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటనపై అభిమానులు, సంగీతకారులు, గాయకులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జిత్ తో కలిసి పలు హిట్ పాటలు పాడిన ప్రముఖ గాయని (Singer) చిన్మయి శ్రీపాద స్పందించింది.. చిన్మయి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్పందిస్తూ, ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ సమయంలో తొలిసారి, అర్జిత్ ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికి ‘తుమ్ హి హో’ విడుదల కాకముందే అతను పరిశ్రమను శాసిస్తాడన్న అంచనాలు ఎవరికీ లేకపోయినా, అర్జిత్ లో మాత్రం అసాధారణమైన నిబద్ధత, వినయం కనిపించిందని ఆమె పేర్కొన్నారు.
స్టార్ సింగర్‌గా ఎదిగిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని చిన్మయి ప్రశంసించారు. అర్జిత్ గురించి మరింతగా ఎమోషనల్‌గా మాట్లాడిన చిన్మయి .. “అతను నా ఫేవరెట్ గాయకుల్లో ఒకడు మాత్రమే కాదు… నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకడు. సంగీతాన్ని అతను చూసే విధానం, ప్లాన్ చేసుకునే తీరులో ఏదో దైవికత ఉంటుంది. ఎప్పుడూ అత్యున్నత స్థాయినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశాడు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: