హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JUDA) డిమాండ్ చేసింది. ఈ మేరకు జుడా ఇప్రభుత్వానికి విజప్తి చేసింది. 2025 జనవరి నుండి జూన్ వరకు జూనియర్ డాక్టర్లకు చెల్లించవలసిన బకాయిల విడుదలలో ఆలస్యం జరుగుతోందన్నారు. బకాయిల విడుదలకు అవసరమైన అన్ని -విధివిధానాలు పూర్తి చేసి, సంబంధిత బిల్లులు శాఖ స్థాయిలో ఆమోదం పొందినప్పటికీ, జ్ఞప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయని జుడాలు తెలిపారు.
Read Also: Phone Tapping Case : సంతోష్ రావు సిట్ విచారణ పూర్తి

జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
ప్రభుత్వం -మంజూరు చేయకపోవడంతో స్టైఫండ్లు, బకాయిల చెల్లింపులు నిలిచిపోయి, రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ వైద్య సేవల వెన్నెముకవంటివారని, బోధనాస్పత్రుల్లో అత్యంత ఒత్తిడి, కఠిన పరిస్థితుల్లో నిరంతర వైద్య సేవలను అందిస్తున్నారని జుడాల నేతలు తెలిపారు. బకాయిల విడుదలలో దీర్ఘకాలిక ఆలస్యం కారణంగా ఆర్థిక స్థిరత్వం, మనోధైర్యం, సమగ్ర సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. జూన్ నెల నుండి ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు ఫాలో అప్లు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2021 బ్యాచ్కు చెందిన పీజీ డాక్టర్లు(PG Doctors) ఎండి పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారు, తమ చట్టబద్ధమైన పీజీ బకాయిలను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారన్నారు. 2022 బ్యాచ్కు చెందిన పీజీ డాక్టర్లు, ఇటీవల వారు కూడా, ఈ ఆలస్యం కొనసాగితే బకాయిల మూలంగా నష్టపోతారని తెలిపారు. ఎండి పూర్తి చేసి సీనియర్ రెసిడెన్సీలో చేరిన
బకాయిలు చెల్లించకపోతే హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ డాక్టర్లు కూడా నష్టపోతారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, పెండింగ్లో ఉన్న బిల్లులకు తక్షణ ఆమోదం తెలపాలని, జనవరి నుండి జూన్ 2025 వరకు ఉన్న అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జుడా కోరుతోంది. సమయానికి బకాయిలు చెల్లింపులు జరగడం ద్వారా జూనియర్ డాక్టర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వారు ప్రజా వైద్య సంస్థల్లో అందిస్తున్న అంకితభావ సేవలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే జూనియర్ డాక్టర్ల ప్రయోజనాల కోసం తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని జుడా నేతలు ప్రభుత్వానికి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: