విజయవాడ : “మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి. తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించాం. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్. అనేక పరిశ్రమలు ఎపికి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు” అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara lokesh) పేర్కొన్నారు. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Read also AP: ఎసిబి వలలో సబ్ ట్రెజరీ అధికారి

Ministers must come to the party office
ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ “పార్లమెంట్ కమిటీల్లో మొదటిసారి ఎన్నికైన వారు 83శాతం మంది ఉన్నారు. సీనియర్లను, జూనియర్లను సమానంగా గౌరవిస్తా. పనిచేస్తే వారిని ప్రోత్సహిస్తాను. దానికి మీరో ఉదాహరణ” అని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక్క తెలుగు దేశానికే సొంతం. మన బలం, బలగం మన కార్యకర్తలు అని అన్నారు. “దేశంలో అభివృద్ధి. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్. ఆయన ఎప్పుడూ ఓ ట్రెండ్ సెట్టర్. 75 యేళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తున్నారు. ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని నిత్యం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు” అని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే.. టీం 11 కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ఎద్దేవా చేశారు.
ఒక్క పెన్షన్లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
“ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ.4వేల వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. వికలాంగులకు రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్నాం. ఒక్క పెన్షన్లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలుచేస్తున్నాం” అని మంత్రి లోకేష్ వివరించారు. “చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 2019 ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా రూ. వెయ్యి పెన్షన్ను రూ.2వేలకి పెంచాం. గత ప్రభుత్వం పెన్షన్ వెయ్యి పెంచడానికి ఐదేళ్లు తీసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పెన్షన్ పెంచి రూ.4వేలు చేశాం. ఇవన్నీ ప్రజలకు వివరించాలి. మనం పనులు చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన పనులు చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం” అని లోకేష్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది
“యువత రాజకీయాల్లోకి రావాలి. అన్ని కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువతను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది. అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. పార్టీ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. మహిళలను కించపరిచే పదాలను విడనాడాలి. పార్టీలో మహిళలను గౌరవించాలి. తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ టిడిపి. ప్రపంచంలో ఏ రంగం చూసినా తెలుగువారు నెం.1గా ఉండే విధంగా మనం కృషిచేయాలి. అదే మన లక్ష్యం” అని లోకేష్ పేర్కొన్నారు. “పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిది. పార్టీ కార్యాలయానికి సమయం కేటాయించాలి. చంద్రబాబు ఎంత పని ఒత్తిడి ఉన్నా వారానికోసారి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు.
విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం
అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నా.. ఎపిలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాఋ, పవనన్న కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు పరిగెడుతున్నాయి. విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. రైల్వేజోన్ ఏర్పాటుచేసుకున్నాం. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువస్తాం. కేంద్ర సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు చేయలేం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి” అని పార్టీ శ్రేణులకు లోకేష్ సూచించారు. అనంతరం మంత్రి లోకేష్ నిత్య విద్యార్థిలా మారి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. శిక్షణ తరగతుల్లో వెనుక కూర్చొని పాఠాలు విన్నారు. వర్క్ షాప్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అంతకుముందు వర్క్ షాప్ లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యులకు మంత్రి లోకేష్ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: