Devara 2 : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత ఏడాది విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు కొరటాల శివ ఈ కథను మొదటి భాగంతోనే ఆపకుండా, సీక్వెల్‌గా ‘దేవర 2’ను ముందే ప్లాన్ చేశారు. సినిమా చివర్లోనే పార్ట్ 2 గురించి హింట్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ పుకార్లకు చెక్ పెడుతూ యువసుధ ఆర్ట్స్ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని కీలక ప్రకటన చేశారు. ‘దేవర 2’ షూటింగ్ 2026 మే నెలలో అధికారికంగా ప్రారంభమవుతుందని, 2027లో సినిమా విడుదల చేయాలనే లక్ష్యంతో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. జంగావ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో మళ్లీ (Devara 2) ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ‘దేవర 2’తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా, త్రివిక్రమ్‌తో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్‌తో మరో క్రేజీ సినిమా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లతో 2028 వరకు ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: