యూపీఎస్సీ(UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష–2026 నోటిఫికేషన్ ఈ వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. వాస్తవానికి జనవరి 14న నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, పరిపాలనా కారణాలతో కొంత ఆలస్యం జరిగింది. తాజా షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 24న నిర్వహించనున్నారు.
Read Also: New Delhi: మంచి జీతంతో మెడికల్ రీసెర్చ్ పోస్టులు

అర్హత, ఎంపిక విధానం
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ(UPSC) మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమ్స్, ఆపై మెయిన్స్ పరీక్షలు, చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
వెబ్‌సైట్: https://upsc.gov.in
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: