ఆధార్ కార్డు(Aadhaar Update) యూజర్లకు యూఐడీఏఐ ఓ మంచి వార్తను ప్రకటించింది. ఈ నెల 28న యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను పూర్తి స్థాయిలో లాంచ్ చేయబోతుంది. ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాలను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా సులభంగా అప్డేట్ చేయవచ్చు.
Read Also: Maldives: మోదీ ట్వీట్‌ను తప్పుగా అనువదించిన ‘గ్రోక్’

ఆన్లైన్ అప్డేట్తో సదుపాయాలు పెరుగుతున్నాయి
ఇప్పటికే ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి యూఐడీఏఐ నూతన సదుపాయాలను ప్రవేశపెట్టుతూ వస్తోంది. ఆధార్ డేటాను అప్డేట్ చేయాలంటే మునుపటి విధంగా ఆధార్ సెంటర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా వివరాలు సవరించుకోవచ్చు.
కొత్త యాప్‌లో ముఖ్యంగా మొబైల్ నెంబర్ అప్డేట్(Aadhaar Update) ఫీచర్‌ను జోడించారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఎక్కడ ఉన్నా తమ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. ఇది జనవరి 28న లాంచ్ కానున్న పూర్తి స్థాయి యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
ఎందుకంటే మొబైల్ నెంబర్ అప్డేట్ అవసరం?
ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇప్పటికీ చాలా కీలకమైనది. ప్రభుత్వ పథకాల లాభాలు పొందాలంటే, బ్యాంక్ KYC కోసం OTP అవసరమైనప్పుడు ఆధార్‌లో నమోదైన నెంబర్‌కు మాత్రమే OTP వస్తుంది. కానీ కొంత మంది వారి మొబైల్ నెంబర్‌ను తరచుగా మార్చుకుంటారు. అలాంటి సందర్భాల్లో నెంబర్ అప్డేట్ చేయకపోతే OTP రాకపోవడం వల్ల సేవలు పొందలేరు.
మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలి?
- Google Play Storeలో “Aadhaar” అని సెర్చ్ చేయండి
- ఆధార్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి
- మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవండి
- Mobile Number Update ఆప్షన్ ఎంచుకోండి
- కొత్త మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డోబ్ వివరాలు నమోదు చేసి OTP ద్వారా ధృవీకరించండి
- కొన్ని రోజుల్లో మీ ఆధార్‌లో నెంబర్ అప్డేట్ అవుతుంది
- Update Status లోకి వెళ్లి స్థితిని తనిఖీ చేయొచ్చు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: