హైదరాబాద్ మహానగరంలో ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి అలాంటి వారికి బిగ్ అలర్ట్. (GHMC Divisions) ఇళ్లూ, ప్లాట్ల కొనుగోలు–అమ్మకాల విషయంలో తాజాగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం తాజాగా తెలంగాణ(TG) ప్రభుత్వం హైదరాబాద్ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన డివిజన్ల పునర్విభజనే.
ఇటీవల చేసిన ఈ పునర్విభజన నగరవాసులకు తలనొప్పిగా మారింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలపై ఇది గణనీయమైన ప్రభావం చూపుతోంది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు శివారు ప్రాంతాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపి మొత్తం 300 డివిజన్లుగా విభజించారు. వీటిలో 250 డివిజన్లు పూర్తిగా కొత్త సరిహద్దులతో ఏర్పడ్డాయి. ఈ మార్పుల వల్ల అనేక కాలనీలు, బస్తీలు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు మారిపోయాయి. ఇలా కొత్త సరిహద్దులు ఏర్పడిన ఇళ్లు, స్థలాలు సుమారు 5 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు కొత్త మ్యాపులు గీశారు కానీ, దానికి తగ్గట్టుగా ఆస్తి రికార్డులను ఆన్‌లైన్‌లో బదిలీ చేయకపోవడమే ప్రస్తుత సమస్యకు మూలకారణం.
Read Also: Attapur crime: ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

డివిజన్ల పునర్విభజనతో మ్యుటేషన్ ప్రక్రియ ఆగింది
పునర్విభజన కారణంగా సర్వర్లలో డివిజన్ల పేర్లు, కోడ్లు మారుతుండటంతో మ్యుటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. మ్యుటేషన్ సర్టిఫికెట్ ఉంటేనే బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేస్తాయి. అది రాకపోవడంతో రుణాలు ఆగిపోయి, అమ్మకాలు నిలిచిపోతున్నాయి. అయితే తాజాగా జరిగిన డివిజన్ల పునర్విభజన వల్ల ఈ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగడం లేదు. దీని వల్ల ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన (GHMC Divisions) కారణంగా ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు, అమ్మకాలతో పాటు కొత్త ఇంటి నంబర్లు, బర్త్/డెత్ సర్టిఫికెట్లు, నిర్మాణ అనుమతులు వంటి పౌర సేవలలో ఆలస్యం ఏర్పడింది. బ్యాంకులు రుణం మంజూరు చేయడం తగ్గింది. ప్రజలు పాత, కొత్త డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు ‘ప్రత్యేక యూనిట్ల’ ద్వారా రికార్డుల బదిలీ పూర్తయ్యే వరకు పాత విధానంలోనే సేవలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: