పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అనగానే లక్షలాది యువతకు ప్రేరణ, ఆదర్శం గుర్తుకు వస్తాయి. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు విశేషమైన అభిమాన వర్గం ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాల్లో తన విలువలు, నమ్మకాలకే పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇస్తారనే విషయం మరోసారి రుజువైంది.
Read also: AP: ఈ నెల 28న కేబినెట్ భేటీ

రూ.40 కోట్ల టొబాకో ఆఫర్
ఇటీవల ఒక ప్రముఖ టొబాకో సంస్థ పవన్ కల్యాణ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador)గా నియమించేందుకు భారీ ఆఫర్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు గాను సుమారు రూ.40 కోట్ల పారితోషికం ఇవ్వడానికి సైతం సిద్ధమైంది. అయితే పవన్ కల్యాణ్ ఏమాత్రం సందేహం లేకుండా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
టొబాకో, సిగరెట్లు వంటి ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. యువత ఆరోగ్యం, భవిష్యత్తుపై ఉన్న బాధ్యతాభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుండగా, “కోట్లు ఇచ్చినా విలువలను వదలని మా హీరో” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆరోగ్యం, యోగా, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: