కర్ణాటకలోని (Karnataka) కోలార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన చిన్న వివాదం ముదిరి ఓ యువకుడి ప్రాణం తీసింది. కారుతో ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన యువకుడు ఆసుపత్రికి (Hospital) తరలిస్తుండగా చనిపోగా.. అంతకుముందు జరిగిన గొడవలో నాలుక తెగడంతో నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: Weather Update: దక్షిణ భారత్‌కు వర్ష సూచన

మాటామాటా పెరగడంతో ఇద్దరూ బీర్ బాటిళ్లతో పరస్పరం దాడి
కోలార్ జిల్లా కమ్మసంద్రలో (Karnataka) జరుగుతున్న క్రికెట్ పోటీలకు ప్రశాంత్ (35), రోషన్ హెగ్డే కారులో వెళ్లారు. మ్యాచ్ అయిపోయాక స్నేహితులు ఇద్దరూ సరదాగా పార్టీ చేసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత సిగరెట్ లైటర్ కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇద్దరూ బీర్ బాటిళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రోషన్ నాలుక తెగిపోవడంతో కారులో ఆసుపత్రికి బయలుదేరాడు. రోషన్ ను ఆపడానికి ప్రయత్నించిన ప్రశాంత్.. కారు డోర్ పట్టుకుని వేలాడాడు. రోషన్ కారును ఆపకుండా వేగంగా నడిపి ప్రశాంత్‌ను ఈడ్చుకెళ్లి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిందితుడు రోషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: