అపార బలానికి, అచంచల భక్తికి ప్రతీకగా నిలిచే హనుమంతుడికి యాలకులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు వివరిస్తున్నారు. ఈ నైవేద్యం భక్తులకు మనోధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ముందుకు సాగేందుకు దోహదపడుతుందని విశ్వాసం.

పేదరిక నివారణకు ఆధ్యాత్మిక మార్గం
హనుమంతుడికి(Hanuman Pooja) యాలకులు అర్పించడం పేదరికాన్ని తొలగించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తిని కలిగిస్తుందని ఆధ్యాత్మిక వర్గాలు చెబుతున్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో పాటు, అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ పూజా విధానం ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు తెస్తుందని విశ్వాసం. అలాగే వ్యాపారస్తులకు లాభాలు పెరిగి, స్థిరమైన వృద్ధి సాధించే అవకాశాలు మెరుగవుతాయని పండితులు పేర్కొంటున్నారు.
శని దోష నివారణకు యాలకుల ప్రాముఖ్యత
స్వామికి నివేదించిన యాలకులను భద్రంగా(Hanuman Pooja) దాచుకుంటే శని దోషాల ప్రభావం తగ్గి, కెరీర్‌లో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయని అంటున్నారు. దీని వల్ల జీవితం లోని అడ్డంకులు తొలగి, శుభకాలం ప్రారంభమవుతుందని భక్తుల నమ్మకం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: