హైదరాబాద్ : (TG) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బిఆర్ఎస్ (BRS) మాజీ ఎంపి సంతోష్ రావుకు సిట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల కు జూబ్లీహిల్స్ ఎసిపి కార్యాలయంలో గల సిట్ ఆఫీస్కు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Read Also: Telangana: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్సTG

మాజీ ఎంపి సంతోష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండవ సిట్ ఏర్పాటయ్యాక ఎస్ఐబి మాజీ ఐజి ప్రభాకర్ రావుతో పాటు బిఆర్ఎస్ అగ్ర (TG) నేతలు హరీష్ రావు, కెటిఆర్లను విచారించడం తెలిసిందే. వీరిద్ద రి విచారణ తరువాత మరికొందరు ముఖ్య నేతలను సిట్ విచారించనుందని వార్తలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ మాజీ ఎంపి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. కాగా తనకు నోటీసులు జారీ అవడంపై సంతోష్ రావు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను విచారణకు హాజరవుతానన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: