ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నెలలో ప్రతి ఆదివారం, రెండో మరియు నాల్గవ శనివారాలతో పాటు కొన్ని ప్రధాన పండుగలు, రాష్ట్ర స్థాయి వేడుకల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
Read Also: Swarnidhi Credit Card: చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త

UPI, మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలు
మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (ఫిబ్రవరి 19), రాష్ట్ర అవతరణ దినోత్సవం (ఫిబ్రవరి 20) సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని RBI స్పష్టం చేసింది. అయితే ఈ రోజుల్లో కూడా నెట్ బ్యాంకింగ్, UPI(Unified Payments Interface), మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే కొనసాగుతాయి. కస్టమర్లు తమ ముఖ్యమైన బ్యాంకు పనులను ముందుగానే ప్లాన్ చేసుకొని పూర్తిచేసుకోవాలని RBI సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: