हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Vizianagaram District: గజరాజులతో జనం బెంబేలు.. భారీగా పంటల నష్టం

Rajitha
Vizianagaram District: గజరాజులతో జనం బెంబేలు.. భారీగా పంటల నష్టం

బొబ్బిలి (విజయనగరం జిల్లా) : సంవత్సరాల తరబడి గజరాజులు గ్రామాలపై పడుతున్నా ప్రభుత్వం తెలిసి తెలియనట్టు మిన్నకుండిపోవడంతో జనాల్లో ఒకంత అసహనం వ్యక్తం అవుతుంది. గజరాజుల వల్ల ఎప్పుడో ఏ ప్రమాదం జరుగుతుందో ప్రజల్లో భయాందోళన రేగుతుందే తప్ప ఆ ప్రాంతాల్లో ఉన్న ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం చూస్తుంటే ఇక్కడ అధికారులు తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ గజరాజులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలలో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. వీటితో ఫారెస్ట్ అధికారులు, సామాన్య ప్రజలు మృత్యువాత పట్టిన విషయం జగమెరిగిన సత్యం. అయినా ప్రభుత్వం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తుండడం చూస్తే సామాన్య ప్రజలు పోతారు మాకేం పోయిందనే చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.

Read also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

People are terrified by the elephants

People are terrified by the elephants

అడవుల నుంచి గ్రామాల వైపు గజరాజుల కదలిక

గతంలో ఈ ఏనుగులతో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 8 ఏనుగులు బొబ్బిలి మండలం రాజుపేట గ్రామం వద్ద సంచరిస్తున్న రెండు మండలాలకు చెందిన ప్రజలు బెంబేలెత్తిపోయి ఏ క్షణం ఏ ఒక్క ప్రాణం పోతుందో అని క్షణం క్షణం భయం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అయినా ఏ ఒక్క ఫారెస్ట్ అధికారి రెవెన్యూ అధికారి వీటిపై చర్యలు తీసుకోలేదు గ్రామస్తుల కాదు చుట్టుపక్క ఉన్న మండలాల సైతం ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు క్షేమం కోరి ఫారెస్ట్ అధికారులను సిబ్బందిని నియమించారు అయినా ఏ ఒక్క అధికారైన వీటిపై పూర్తిస్థాయి చర్యలు చేపట్టకపోవడం చూస్తే కేవలం ఈ అధికారులు షా మిల్లుల వద్ద మామూళ్లు వసూలు చేసుకోవడం కే ఈ అధికారులు ఉపయోగపడుతున్నారని ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా వీటిపై ప్రభుత్వానికి నివేదించడంలో వెనుకంజ వేస్తున్నారు.

పంటల నాశనం.. రైతులకు తీరని నష్టం

దీనివల్ల దీని వెనుక ఉన్న నిగూడ అర్థం ఏమిటో అంతు పట్టడం లేదు. కేవలం ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బిక్కుబిక్కు మంటూ రాత్రింబవళ్లు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న ఉన్నతాధికారులకు కాని, ప్రజా ప్రతినిధులకు గాని తెలియజేసి ఈ సమస్యను తుది ముట్టించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతకాలం ఇలా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నివాసం చేయాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో గత మూడు సంవత్సరాలుగా గజరాజులు సంచారం చేస్తున్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కాని, అధికారి కాని వీటిపై సరైన నిర్ణయం తీసుకొని వీటిని జనసంచారాల్లో తిరగడం నిరోధించడంలో పూర్తిస్థాయిలో విఫలమై ఈ ప్రాంతాల్లో ప్రజలకు గజరాజులపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

ప్రజా ప్రతినిధులపై పెరుగుతున్న విమర్శలు

ప్రజా ప్రతినిధులు వీటిపై సత్వర చర్యలు చేపట్టకపోవడం ఎంతోమంది చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు కోకలుగా వినిపిస్తున్నాయి. అటవీ సిబ్బంది సామాన్య ప్రజలు అరటి చెరుకు తదితర పంటలను నాశనం చేస్తున్న ఉన్నత వర్గం వీటిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలా ప్రయాణ రక్షణలో ప్రజలు ఎంతవరకు క్షణం క్షణం భయం భయంగా నివాసం ఉండాలని అంటున్నారు. ప్రజా ప్రతినిధులు వీటిపై ఏ విధమైన చర్యలు తీసుకొని రాష్ట్ర అధికారులకు తెలియజేయడంలో వెనుకంజ వేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా చర్యలు చేపట్టడంతో ప్రజల గుండెల్లో గుబులు మిగులుతుంది తప్ప ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు.

వీటిపై విజయనగరం అటవీ రేంజ్ అధికారి రామ్ నరేష్ బిర్లంగిను వివరణ కోరగా వీటిపై మా సిబ్బందిని ఎక్కువ మందిని అక్కడకు విధులకు పంపించామని వీటిని నివారించడానికి తాత్కాలిక అటవీ వలయంను తయారు చేస్తున్నామని పార్వతీపురం జిల్లా సీతారాం మండలంలో కొంత అటవీ ఏరియాలో తాత్కాలిక ఏనుగులు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టామని అంత వరకు వీటిని ఇలాగే సంచారం చేయిస్తామని వాటికి శిక్షణ ఇచ్చి చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ఏనుగులను (కుంకీలను) తెప్పిస్తున్నామని వాటితో వీటికి శిక్షణ ఇస్తామని విజయనగరం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి రామ నరేష్ బిల్లా తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870