మెగాస్టార్ చిరంజీవి ‘కాస్టింగ్ కౌచ్’ (Casting Couch) లేదని చేసిన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. చిన్మయి తన పోస్ట్ లో, స్పందిస్తూ.. ‘మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి.. ‘కమిట్మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇక్కడ అవకాశాలు రావు. మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం ఇక్కడ సర్వసాధారణం’ అని కుండబద్దలు కొట్టారు.
Read Also: Actor: వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు
కొన్ని షాకింగ్ ఉదాహరణలు
చిరంజీవి గారి తరం వేరని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని, కానీ నేటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతూ చిన్మయి కొన్ని షాకింగ్ ఉదాహరణలు ఇచ్చారు.. ‘ఒక ప్రముఖ వ్యక్తి ఒక ఫిమేల్ మ్యూజిషియన్ న్ను స్టూడియోలో లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణభయంతో సౌండ్ బూత్ లో, తనను తాను లాక్ చేసుకుంది.
మరొక సీనియర్ వచ్చి కాపాడే వరకు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ఈ రంగాన్నే వదిలేసింది. అలాగే ఒక ప్రముఖ గాయకుడు ఎటువంటి ప్రేరేపణ లేకుండా మహిళలకు తన పురుషాంగం ఫోటోలు పంపి, లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తుంటాడు. ఇలాంటి నేరస్తులకు సమాజం మళ్ళీ రెడ్ కార్పెట్ వేస్తుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: