US Green Card news : అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పులతో 2027 నాటికి సుమారు 50,000 అదనపు ఎంప్లాయ్‌మెంట్-బేస్డ్ గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంతో, ఫ్యామిలీ కోటాలో మిగిలిపోయిన వీసాలు ఎంప్లాయ్‌మెంట్ కోటాకు బదిలీ కానున్నాయి. ఈ నిషేధం ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చింది.
గతంలో కోవిడ్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, అప్పుడు ప్రయారిటీ తేదీలు కొంత ముందుకు వచ్చినట్టు నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈసారి నిషేధం 2026 సెప్టెంబర్ వరకు కొనసాగితే, దాదాపు 50,000 వీసాలు మిగిలే అవకాశముందని అంచనా. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫ్యామిలీ వీసాలు మిగిలే అవకాశం ఉంది.
Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

అయితే, గ్రీన్ కార్డుల సంఖ్య పెరిగినా భారతీయులకు మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల (US Green Card news) ప్రకారం, ఏ దేశానికైనా సంవత్సరానికి మొత్తం ఎంప్లాయ్‌మెంట్ గ్రీన్ కార్డుల్లో గరిష్ఠంగా 7 శాతం మాత్రమే కేటాయిస్తారు. ఈ ‘పర్-కంట్రీ క్యాప్’ కారణంగానే భారతీయులు ఎదురుచూస్తున్న నిరీక్షణ కాలం తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్ నుంచి దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో, అదనపు వీసాలు వచ్చినా వేగంగా ముందుకు కదలడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: