తన దర్శకత్వంలో వచ్చిన తొమ్మిది చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించినప్పటికీ, తనలో ఏమాత్రం గర్వం లేదని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పష్టం చేశారు. తాను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, జీవితంలో ఎదుర్కొన్న కష్టాల వల్లనే మానవ సంబంధాల విలువను అర్థం చేసుకున్నానని అన్నారు.
Read Also: Prabhas: ప్రభాస్ తొలి సినిమా రెమ్యూనరేషన్ ఎంతంటే?

దిగువ మధ్యతరగతి నుంచి టాప్ డైరెక్టర్
తనకు తెలిసిన వ్యక్తులు రోడ్డుపై ఎదురైతే కారులోనే ఉండకుండా దిగిపోయి పలకరించడం, వారితో కలిసి కాసేపు మాట్లాడడం, అవసరమైతే టీ తాగడం తన సహజ స్వభావమని తెలిపారు. సినిమాల్లో ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా, మనిషిని మనిషిలా గౌరవించడమే అసలైన విజయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సాదాసీదా స్వభావం, ఆత్మీయంగా మెలిగే తత్వం ఇండస్ట్రీలోని పలువురు నటీనటులను ఆకట్టుకుందని అన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) వంటి అగ్ర కథానాయికలు కూడా తన జోవియల్ నేచర్‌ను ప్రశంసించినట్టు తెలిపారు. విజయాల మధ్య కూడా నేలను మరిచిపోకుండా నిలబడడమే తన జీవన సూత్రమని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: