हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Republic Day :సమసమాజ స్థాపనే నిజమైన దేశభక్తి

Sudha
Republic Day :సమసమాజ స్థాపనే నిజమైన దేశభక్తి

భారతదేశంలో స్వేచ్ఛస్వాతం త్ర్యాల మనుగడకు, దేశప్రగతికి బాధ్యతాయుత ప్రజాస్వామ్య పాలన పునాదిరాయి. గణతంత్ర దినోత్సవం కేవలం ఒక జాతీయ వేడుకమాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య ఆత్మను, రాజ్యాంగ సంకల్పాన్ని, పౌరులహక్కు లు, బాధ్యతల సమతుల్యతను గుర్తు చేసే మహత్తర సందర్భం. స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన జాతికి సంక్రమిం చిన జన్మహక్కులు. అయితే ఈ రెండూ విడివిడిగా ఉండలేవు. స్వేచ్ఛ వ్యక్తిగతమైనదైతే, స్వాతంత్ర్యం సామాజికమైనది. స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ అర్థం కోల్పోతుంది. స్వేచ్ఛ లేని స్వాతంత్య్రం ఖాళీ నినా దంగా మిగులుతుంది. బాధ్యతతో కూడిన స్వేచ్చే నిజమైన స్వాతంత్య్రానికి ప్రతీక. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా నడ
వాలంటే పౌరులు హక్కులతో పాటు బాధ్యతలను కూడా సమానంగా స్వీకరించాలి. ఈ సమన్వయంపైనే దేశ సామా జిక, రాజకీయ స్థిరత్వం ఆధారపడి ఉంటుంది. నిజమైన దేశభక్తి అంటే నినాదాలు కాదు, బాధ్యతాయుత పౌర జీవ నమే. రాజ్యాంగ ఆశయాలు ప్రజాస్వామ్య వాస్తవాలు భారత రాజ్యాంగం వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ, అన్నిరకాల
అస మానతలను నిర్మూలించి ప్రతి పౌరునికి ఆర్థికసామాజిక, రాజకీయ న్యాయం అందించాలన్న సంకల్పంతో రూపుదిద్దు కుంది. ప్రజాస్వామ్య పాలనలక్ష్యం శ్రేయోరాజ్యం నిర్మాణమే. అయితే ఈ రాజ్యాంగ ఆశయాలు ఎంతవరకు అమలవుతు న్నాయి అన్న ప్రశ్న నేడు సమాజాన్ని వెంటాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలకు
చేరువవుతున్నా, ప్రభుత్వ విధానాలు జాతీయ వనరులపై కొద్దిమంది ఆధి పత్యాన్ని పెంచిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రగతి ఫలాలు సమానంగా పంచబడకపోవడం వల్ల పేదలు, అణగారిన వర్గాలు మరింత దోపిడీకి గురవుతు న్నాయి. జాతి సంపద కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమవడం ప్రజాస్వామ్య మౌలిక
సూత్రాలకు విరుద్ధం. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్యాయం సాధిం చకపోవడం వల్ల పేదరికం, నిరుద్యోగం, లింగ వివక్ష, అవి నీతి, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలు ఇప్పటికీ పరి ష్కార దశకు చేరకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదాన్ని కలిగిస్తోంది.

Read Also : http://Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు

Republic Day
Republic Day

వీధి రాజకీయాలు

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, అది నిత్యజాగ్రత్తతో నిలబడే వ్యవస్థ. ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. పాలితులు ఒకే నాణానికి రెండు ముఖాలు. పాల కులు ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వస్తారు. పాలితులు తమ హక్కులను చట్టబద్ధంగా వినియోగించుకుంటూ బాధ్యతలు
నిర్వర్తించాలి. పౌర సమాజ గౌరవాన్నిప్రభుత్వం రక్షించినంతకాలం ప్రజల సహకారం సహజం. కానీ అదే ప్రభుత్వం ప్రజల గౌరవాన్ని దోచుకుంటే, సహకార నిరాకరణ చేయడం పౌరుల ధర్మం. వీధి రాజకీయాలు, అవివేక పూరిత నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలను కాలరాయడంవంటి చర్యలు దేశ భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపుతాయి. పాలన ప్రజల ఇష్టాలపై సాగాలి గానీ, ప్రభుత్వాల ఇష్టాలపై కాదు. ప్రజల యోగక్షేమాల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండేవాడే నిజమైన ప్రజానాయకుడు. అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, దాష్టీకం వంటి పద్ధతులు రాజనీతి కావు. అవి ప్రజాస్వా మ్యానికి శత్రువులు. శాంతి అంటే బలహీనత కాదు. ప్రజల అమాయకత్వాన్ని పాలకులు తక్కువగా అంచనా వేయరాదు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే స్వేచ్ఛను కాపా డుకోగలరు. చట్టంముందు పౌరులందరూ సమానమే మాన్యు డైనా, సామాన్యుడైనా అన్నసూత్రాన్ని తూచా తప్పకుండా అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం. గణ తంత్ర దినోత్సవం (Republic Day)మనకు గుర్తు చేస్తుంది దేశ భవిష్యత్తు పాలకుల చేతుల్లో మాత్రమే కాదు, ప్రతి పౌరుని చేతుల్లో ఉందని. నిరంకుశ పాలకులు వస్తారు పోతారు. ప్రజాసేవ పేరుతో అధికారపీఠాన్ని అధిరోహించిన వారు తమ పాలనా విధానాల్లో,నిర్ణయాల్లో, ప్రజాధన వినియోగంలోప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనం, నిస్వార్థత పాటించాలి. మానవీయ పాలన అందించడం పాల కుల ప్రధాన బాధ్యత. అదే సమయంలో పాలన సరిగాలేక పోతే ప్రభుత్వాలను ప్రజాకోణంలో విధానపరంగా ప్రశ్నించ డం, విమర్శించడం, అసమ్మతి వ్యక్తపరచడం పౌరులు మౌలిక హక్కు. ఈహక్కులను అణచివేయ రాదనిసుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Republic Day
Republic Day

సమాన అభివృద్ధి

ప్రజల పక్షానమీడియా, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు ప్రశ్నించడం మానేస్తే ప్రజాస్వాయ్యం ఎలా బతుకుతుంది? ప్రశ్నను, ప్రశ్నించేవారిని, విమ ర్శకుల స్వేచ్ఛను పాలకులు ఎలా గౌరవిస్తున్నారన్నదానిపైనే ‘ప్రజాస్వామ్య మనుగడను’ అంచనా వేయవచ్చు.పజల్లో స్వేచ్ఛా స్పూర్తి, సమైక్య భావం, పోరాడే చైతన్యం జీవిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. హక్కులు బాధ్యతల సమ తుల్యతతో కూడిన పౌరసమాజమే సమసమాజ-నికిపునాది. ప్రజాస్వామ్య పాలనలో అన్ని సామాజిక స్థాయిల ప్రజలు సమానంగా అభివృద్ధి సాధించినప్పుడే అది నిజమైన ప్రజా స్వామ్యం అవుతుంది. లేకపోతే అది కేవలం రాజ్యాంగ పదజాలంగా మిగులుతుంది. ఈ గణతంత్ర దినోత్సవ (Republic Day) సందర్భంగా మనమందరం ఒకసారి ఆలోచించాలి. దేశభక్తి అంటే? జెండాలు పట్టుకొని ఒకరి నొకరు ద్వేషించుకోవడం కాదు. ప్రజాస్వామ్య విలువలను పాలకులు పాలనలో, పాలితులు జీవన విధానంగా మార్చడమే నిజమైన దేశభక్తి. అటువంటి బాధ్యతాయుత పాలకులు, పౌరులే బలమైన భారత గణతంత్రానికి నిజమైన రక్షకులు.

-మేకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు అద్భుతంగా జరిగాయి: పవన్

అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు అద్భుతంగా జరిగాయి: పవన్

No image

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు!

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో

టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే దేశ భద్రత: దివాకర్ రెడ్డి

సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే దేశ భద్రత: దివాకర్ రెడ్డి

యువకుడి దారుణ హత్య.. పాతకక్షలే కారణమా?

యువకుడి దారుణ హత్య.. పాతకక్షలే కారణమా?

ఫిబ్రవరి 17న విద్యార్థులకు ఆల్బెండజోల్ ఉచిత పంపిణీ

ఫిబ్రవరి 17న విద్యార్థులకు ఆల్బెండజోల్ ఉచిత పంపిణీ

విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
1:31

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

📢 For Advertisement Booking: 98481 12870