హీరో మంచు మనోజ్(Manchu Manoj) ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ ‘డేవిడ్ రెడ్డి’కి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Read Also: Chiranjeevi: క్యాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు

రిపబ్లిక్ డే సందర్భంగా
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న మూవీ ఫస్ట్ లుక్(Movie first look) పోస్టర్‌ను విడుదల చేయగా, అది ప్రేక్షకుల్లో ఉత్సుకతను మరింత పెంచింది. ఆ పోస్టర్లో మంచు మనోజ్ గంభీరమైన అభినయంతో, నల్లటి మసి పూసుకున్న ముఖం, భుజంపై ఇనుప తీగలతో చుట్టిన కర్ర పట్టుకుని కనిపించారు.
“నాలో కొత్త రూపం… ఉగ్రంగా, కరుణలేని మనసుతో” అనే భావాన్ని వ్యక్తపరిచే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ అభిమానులకు రోమాంచాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: