ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (ICC T20 World Cup 2026) లో తమ భాగస్వామ్యంపై నెలకొన్న అనుమానాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టత ఇచ్చింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ మెగా టోర్నీని పాకిస్థాన్ బహిష్కరిస్తుందన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ, ఇవాళ అధికారికంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ టోర్నీలో పాల్గొంటుందన్న విషయం స్పష్టమైంది.
Read Also: Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు
ఈ జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది జట్టులోకి తిరిగి వచ్చారు.స్టార్ పేసర్ హరీస్ రౌఫ్‌ను జట్టు నుంచి తప్పించారు. అతని ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన కీపర్‌గా వ్యవహరించనున్నారు.
పాకిస్థాన్ తుది జట్టు (15 మంది సభ్యులు)
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే (కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీం షా, సాహిబ్జాదా ఫర్హాన్ (కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఉస్మాన్ తారిక్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: