ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర (Maharashtra) లోని నాందేడ్‌కు చేరుకున్నారు. ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షహీదీ సమాగమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి హోదాలో ఘన స్వాగతం పలికింది. నాందేడ్‌లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఎమ్మెల్యే జయ చవాన్,
Read Also: AP: భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు
ప్రభుత్వ అతిథిగా ఘన స్వాగతం
ఎమ్మెల్సీ రాజార్ కర్, జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ (Guru Teg Bahadur sahib Ji) 350వ షహీదీ సమాగమానికి డిప్యూటీ సీఎం హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు మోదీ మైదాన్ లో నిర్వహించే దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు.

కార్యక్రమ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. బేగంపేటకు ఎయిర్ పోర్టుకు చేరుకొని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్తారు. సుమారు 10 లక్షల మంది భక్తులు కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అతిథిగా హాజరు కావడం పట్ల జనసేన శ్రేణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: