కిడ్నీ సమస్యను వ్యక్తిగత ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడకూడదు. ఇది ఆ కుటుంబం మొత్తం ఆర్థిక పరిస్థితిని ఊడగట్టే సమస్యగా మారుతుంది. డయాలసిస్ కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం, ప్రైవేట్ ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చు చేయడం మధ్యతరగతి, పేద కుటుంబాలకు భయానక భారం.
Read Also: Coffee: ఉదయం మంచిది, సాయంత్రం కాదు

మారుమూల ప్రాంతాల్లో డయాలసిస్ సేవలు రోగి దగ్గరే
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) రాష్ట్రంలోని సెకండరీ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద 13 కొత్త డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలకు అదనంగా మరో 5 కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. ఇందులో రెండు కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చెప్పారు.
కొత్త కేంద్రాల స్థానం మరియు సేవల సమయం
ప్రజా ప్రతినిధుల సూచన మేరకు ప్రధాన మంత్రి డయాలసిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐదు కొత్త కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ కేంద్రాలు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు:
- తిరుపతి జిల్లా రైల్వేకోడూరు
- ప్రకాశం జిల్లా కొండేపి
- తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు
- కడప జిల్లా మైదుకూరు
- ఎన్టీఆర్ జిల్లా నందిగామ
అదనంగా, భీమవరం, పీలేరు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, జమ్మలమడుగు ప్రాంతాల్లో టెండర్లు వేగంగా జరుగుతున్నాయి. ఎస్ కోట, సీతంపేటలో ఇప్పటికే కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.
ఆధునిక పరికరాలతో ఏర్పాట్లు & సామర్థ్యం
ప్రతి డయాలసిస్(AP Govt) కేంద్రాన్ని ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కో కేంద్రానికి సుమారు ₹85 లక్షల వ్యయంతో యంత్రాలు అమర్చుతున్నారు. మొత్తం 13 కేంద్రాల కోసం ప్రభుత్వం సుమారు ₹11 కోట్లు ఖర్చు చేయనుంది.
ప్రతి కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఉంటాయి మరియు రోజుకు 3 షిఫ్టుల్లో సేవలు అందించబడతాయి. దీనివల్ల ఒక కేంద్రం నెలకు సుమారు 375 సెషన్లను నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.
డయాలసిస్ ఖర్చు & ప్రభుత్వ ఉచిత సేవలు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక డయాలసిస్ సెషన్ ₹3,000 నుంచి ₹4,000 వరకు ఖర్చు పడుతుంది. నెలకు 10 సార్లు డయాలసిస్ అవసరమైతే, ఇది సాధారణ కుటుంబానికి భరించలేనిది. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 2,047 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తోంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో కిడ్నీ బాధితుల కోసం కూటమి ప్రభుత్వం ₹164 కోట్ల వ్యయం చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: