ఇండియన్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal), మంధాన స్నేహితుడు, నిర్మాత విజ్ఞాన్ మానె కు పరువు నష్టం నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ రూ.10 కోట్లకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మానెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sarvam Maya Movie: ఈ నెల 30 నుంచి ఓటీటీలోకి ‘సర్వంమాయా’
చట్టపరమైన చర్యలు
ఇటీవల విద్యన్ మానే సంచలన ఆరోపణలు చేశారు, ఒక సినిమా ప్రాజెక్ట్ పేరుతో పలాష్ తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అంతేకాకుండా టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో జరగాల్సిన పెళ్లి క్యాన్సల్ కావడానికి పలాష్ ప్రవర్తనే కారణమని ఆరోపించాడు. పలాష్ మరో మహిళతో దొరికిపోయాడని,

ఆ సమయంలో మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారని అందుకే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని అతడు ఆరోపించాడు.అయితే ఈ ఆరోపణలను పలాష్ ముచ్చల్ పూర్తిగా కొట్టిపారేస్తూ తన లాయర్ శ్రేయాన్ష్ మిథారే ద్వారా లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని పలాష్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: