
ఆంధ్రప్రదేశ్ (AP)లోని కృష్ణా జిల్లా మోపిదేవిలో వెలసిన ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని సినీ నటుడు (Actor) నారా రోహిత్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రోహిత్‌కు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రోహిత్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఆయనను శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Mahesh Babu: క్లీన్ షేవ్డ్ లుక్‌లో సూపర్ స్టార్?
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: