ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో (UNHRC) తమ దేశానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించడంపై ఇరాన్ (Iran) హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భారత్‌లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ శనివారం ప్రకటించారు. ఇది అన్యాయమైన, రాజకీయ ప్రేరేపిత తీర్మానమని, దీనిని వ్యతిరేకించడం ద్వారా భారత్ న్యాయం, బహుపాక్షికత, జాతీయ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉందని చాటిందని ఆయన ప్రశంసించారు.
Read Also: US: చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

ఇరాన్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్న భారత్
శుక్రవారం జరిగిన UNHRC 39వ ప్రత్యేక సమావేశంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. (Iran) గతేడాది డిసెంబర్ 28 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఇరాన్ ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేయడాన్ని ఈ తీర్మానం తీవ్రంగా ఖండించింది. ఈ అణచివేతలో వేలాది మంది పౌరులు, చిన్నారులు మరణించారని, అనేకమంది గాయపడ్డారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 25 దేశాలు, వ్యతిరేకంగా 7 దేశాలు ఓటు వేయగా, 14 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఇరాన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానంతో అంతర్జాతీయ నిజనిర్ధారణ కమిటీ, ప్రత్యేక ప్రతినిధి పదవీ కాలాలను పొడిగించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. అలాగే, ఇరాన్ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లవద్దని, ఇప్పటికే ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని భారత్ పౌరులకు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: