వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ బుకింగ్ విధానంలో రైల్వే బోర్డు కీలక సవరణలు చేసింది. సుదూర ప్రయాణాలను మరింత పారదర్శకంగా,(IRCTC Updates) సమర్థవంతంగా నిర్వహించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ప్రయాణికులకు మెరుగైన అనుభవంతో పాటు సీట్ల వృథాను తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
Read Also: Credit Card: ఈ స్మార్ట్ టిప్స్‌తో సిబిల్ స్కోర్ కాపాడుకోండి

అమృత్ భారత్ స్లీపర్ క్లాస్‌లో RAC పూర్తిగా రద్దు
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాస్‌లో ఇకపై RAC (Reservation Against Cancellation) సదుపాయం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ప్రారంభమైనప్పటి నుంచే అందుబాటులో ఉన్న అన్ని బెర్త్‌లు నేరుగా కన్ఫర్మ్ అవుతాయి. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉన్న కోటాలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే స్లీపర్ క్లాస్‌లో అదనపు కోటాలు ఉండవు.
8 గంటలలోపు టికెట్ రద్దు చేస్తే జీరో రీఫండ్
వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ వంటి ప్రీమియం(IRCTC Updates) రైళ్లు బయలుదేరే సమయానికి 8 గంటలలోపు కన్ఫర్మ్డ్ టికెట్లను రద్దు చేస్తే ఇకపై ఎలాంటి రీఫండ్ ఉండదు. చివరి నిమిషం రద్దులను తగ్గించి, సీట్ల వినియోగాన్ని పెంచడమే ఈ నిర్ణయానికి కారణం. 8 గంటలకు మించిన వ్యవధిలో రద్దు చేస్తే ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు వర్తిస్తాయి.
రద్దు ఛార్జీల వివరాలు ఇవే
- రైలు బయలుదేరే సమయానికి 72 గంటల ముందే రద్దు చేస్తే → 25% ఛార్జీ కట్
- 72 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే → 50% ఛార్జీ కట్
- 8 గంటలలోపు రద్దు చేస్తే → పూర్తి టికెట్ మొత్తం నష్టం
ఈ ప్రీమియం రైళ్లకు ఇకపై పాక్షిక రీఫండ్ సదుపాయం వర్తించదు.
ప్రీమియం రైళ్లకే ఈ నిబంధనలు
వంద శాతం కన్ఫర్మ్డ్ బెర్త్ విధానంతో నడిచే వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లకు మాత్రమే ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. చివరి నిమిషంలో టికెట్లు రద్దు కావడం వల్ల బెర్త్‌లు ఖాళీగా ఉండిపోతుండటంతో రైల్వేకు ఆదాయ నష్టం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.
అందుకే ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: