రథ సప్తమి పర్వదినంలో కొన్ని ముఖ్యమైన ఆచారాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు(FestivalGuidelines) సూచిస్తున్నారు. ఈ రోజు చేసే ప్రతి చర్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని శాస్త్రోక్తంగా పేర్కొంటున్నారు. రథ సప్తమి రోజున నూనెతో చేసే అభ్యంగ స్నానం వర్జ్యమని పండితులు చెబుతున్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే శుభఫలితాలు దూరమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ పవిత్ర దినాన మాంసాహారం, మద్యపానం పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు. శుద్ధమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
Read Also: RathaSaptami: అరుణోదయ స్నానం ఎలా చేయాలి?

జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దు
రథ సప్తమి రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయరాదని పండితులు (FestivalGuidelines) చెబుతున్నారు. ఇవి అశుభానికి కారణమవుతాయని విశ్వాసం. శాస్త్ర ప్రకారం సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం, సప్తమి రోజుల్లో కూడా ఈ నియమాలను పాటించాలట. అలా చేయడం వల్ల శుభఫలితాలు లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: