మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)–2026 ముగిసిన వెంటనే భారత మహిళా క్రికెట్ జట్టు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లకు సంబంధించిన జట్లను ప్రకటించిన బీసీసీఐ, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టు (IND vs AUS Test) మ్యాచ్‌కు భారత మహిళా జట్టును అధికారికంగా ప్రకటించింది.
Read Also: T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు సాంగ్ కంపోజ్ చేస్తున్న అనిరుధ్
ప్రతీకా రావల్‌కు చోటు
ఈ టెస్టు జట్టుకు అనుభవజ్ఞురాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు శనివారం వెల్లడించింది.టెస్టు జట్టులో ప్రతీకా రావల్‌కు కూడా చోటు దక్కింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో స్మృతి మంధానకు ఒపెనింగ్ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. త్వరలో భారత మహిళా జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఓపెనింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలెక్టర్లు స్థానం కల్పించారు.
భారత జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ, జెమీమా, అమన్‌జోత్, రిచా, ఉమ, ప్రతికా రావల్, హర్లీన్, దీప్తి, రేణుక, స్నేహ్ రాణా, క్రాంతి, వైష్ణవి, సయాలి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: