అరుణోదయ స్నానం చేయాలంటే సూర్యోదయానికి(RathaSaptami) ముందే లేచి, తూర్పు వైపు ముఖమునుపు నిలవాలి. ఇది సూర్యభక్తికి సంబంధించిన ప్రత్యేక ఆచారం. స్నాన సమయంలో తలపై ఒకటి, భుజాలు, మోచేతులు, మోకాళ్లపై రెండు చొప్పున కలిపి మొత్తం ఏడు (7) జిల్లేడు ఆకులు పెట్టుకోవాలి. ఆ ఆకులపై రేగుపళ్లను కూడా ఉంచి స్నానం చేయాలి. ఈ స్నానంతో పాటు సూర్య మంత్రాలను పఠించటం ద్వారా శక్తి, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
Read Also: Venkaiah Chowdary: భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు

రేగుపళ్ల ప్రయోజనం
నెత్తినపై రేగుపళ్లను(RathaSaptami) వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, శరీర శక్తి పెరుగుతుందని నమ్మకం. స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. దీని ద్వారా ఆయురారోగ్యం, ఆర్థిక స్థిరత్వం, కార్యసిద్ధి లభిస్తాయని, గత జన్మ పాపాలు తొలగిపోతాయని పూజారులు విశ్వసిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: