
కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఈ వీడియో భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
Read Also: UP: తన కాలును తానే నరుక్కున్న యువకుడు.. ఎందుకో తెలుసా?

భక్తుల ఆగ్రహంతో స్పందించిన అధికారులు
వీడియో వైరల్(ViralVideo) కావడంతో భక్తులు ఆలయ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఆలయ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పరిశుభ్రత లోపంపై విచారణ చేపట్టి బాధ్యులైన ఇద్దరు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
తక్షణమే శుభ్రత చర్యలు
నమూనాలయంలో ప్రసాదం నిల్వ చేసే ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి,(ViralVideo) భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షణను పెంచినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న నమూనాలయం వద్ద దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: