2047 నాటికి దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సంఖ్యను గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. ప్రస్తుతం ఉన్న 164 విమానాశ్రయాలను 350కి విస్తరించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Medaram Jatara : మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

1,700 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు
దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశంలో మాట్లాడిన మంత్రి, భారత విమానయాన సంస్థలు ఇప్పటికే సుమారు 1,700 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయని, ఇవి సేవల్లోకి వస్తే దేశీయ విమానయాన సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు.
ప్రస్తుతం భారత్ ఏటా 10 నుంచి 12 శాతం వృద్ధిరేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న విమానయాన మార్కెట్‌గా నిలవడమే కాకుండా, మూడో అతిపెద్ద మార్కెట్‌గా కూడా అవతరించిందని ఆయన వివరించారు. దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం ద్వారా గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషించనుందని మంత్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: