టీ20 క్రికెట్‌లో టీమిండియా (Team India) మరో సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేధించిన జట్టుగా, భారత్ రికార్డు సొంతం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ యువ జట్టు, మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం విశేషం.ఈ విజయంతో భారత్, తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టింది.
Read Also: Badminton International: తులసిమతికి మూడు బంగారు పతకాలు

అత్యధిక ఛేదన
గతంలో న్యూజిలాండ్‌పైనే 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 24 బంతులు మిగిల్చి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును అధిగమించింది. అంతేకాకుండా టీ20ల్లో టీమిండియా (Team India) కు ఇది సంయుక్తంగా అత్యధిక ఛేదన. 2023లో ఆస్ట్రేలియాపై కూడా భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 ఫార్మాట్‌లో భారత్ 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (7 సార్లు) అగ్రస్థానంలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: