ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నగరి జూనియర్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Read Also: Nara Lokesh : థాంక్యూ పవనన్నా, నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

ప్రజల నుంచి ప్రత్యక్షంగా వినతుల స్వీకరణ
హెలిప్యాడ్ వద్దే ముఖ్యమంత్రి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై ప్రజల(Public Meeting) నుంచి వినతులు తీసుకుని, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తదుపరి శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.
పార్టీ బలోపేతంపై టీడీపీ శ్రేణులతో చర్చ
అనంతరం నగరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
సీఎం పర్యటన నేపథ్యంలో నగరిలో భారీ భద్రతా(Public Meeting) ఏర్పాట్లు చేపట్టారు. పోలీసు శాఖ, పరిపాలనా అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరిలోని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం తిరుగు ప్రయాణం చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: