రోజూ తినే చపాతీల సంఖ్య వ్యక్తి చేసే శారీరక శ్రమ, వయస్సు, శరీర బరువును బట్టి మారుతుంది. సాధారణ పనులు చేసే వారు రోజుకు 4 నుంచి 6 చపాతీలు తీసుకోవచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రోజుకు 2 నుంచి 4 చపాతీలకే పరిమితం కావడం మంచిదని పోషకాహార నిపుణులు(Nutrition Advice) సూచిస్తున్నారు. ఈ సమయంలో చపాతీలతో పాటు సలాడ్లు, పప్పు ధాన్యాలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అధిక శారీరక శ్రమ చేసే వారు రోజుకు 6 నుంచి 8 చపాతీలు తీసుకున్నా సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Balanced Diet: తరచూ ఆకలి వేయడం వెనుక దాగి ఉన్న కారణాలు

రాత్రి వేళ చపాతీలు తినేటప్పుడు జాగ్రత్త అవసరం
రాత్రి సమయంలో శరీరంలోని జీర్ణక్రియ(Nutrition Advice) మందగిస్తుంది. అందుకే రాత్రి భోజనంలో 1 నుంచి 2 చపాతీలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: