
తిరుపతి: చిన్న వయస్సులోనే రాష్ట్ర రాజకీయాల్లో అపార అనుభవజ్ఞుడిగా అభివృద్దే లక్ష్యం గా పనితీరు సాగిస్తున్న యువనేత,రాష్ట్ర ఐటి,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్ అని తుడ చైర్మన్ , టి డి పి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్య దర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి(Diwakar Reddy), టి డి పి నేతలు,శుభం ఈవెంట్స్ అధినేత ఆవుల ఈశ్వర్ రెడ్డి,తెలుగు ప్రొఫెషనల్ వింగ్ లీడర్ టి.సుమంత్ చౌదరి తెలిపారు.
Read Also: AP: దావోస్ పర్యటన తర్వాత SLBC సమావేశంలో సీఎం సమీక్ష
ఆయన సారధ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృధి
ఆయన సారధ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృధి జరుగుతోందనీ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా అభివృద్ధి లో రాజీ లేకుండా వడి వడి గా అడుగులు వేస్తున్నారని అన్నారు. దేశ విదేశాల్లో తెలుగు ప్రజల సత్తా చాటేలా ఎందరో పారిశ్రామిక వేత్తలను, సాఫ్ట్వేర్ దిగ్గజాల ను కలసి రాష్ట్రంలో పెట్టుబడు లు, పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సాహం ఇస్తున్నారని చెప్పారు. యువగళం లో ప్రజలకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రభుత్వానికి దశ దిశా మార్గ నిర్దేశం చేస్తూన్నారు అన్నారు. ఈ రోజు ఆయన జన్మదినం వేడుకగా, పేద ప్రజల నడుమ జరుపుకోవడం కూడా జరుగుతుందన్నారు. యువత నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం పెద్ద కాపు వీధి కూడలిలో ముఖ్య నేతలు, నిర్వాహకులు కలసి లోకేశ్ పేరున పేదలకు అన్నదానం చేయడం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: