ఆధునిక యుగంలో యుద్ధాలు అనాగరికానికి, అరాచక వాదా నికి పరాకాష్ట. మధ్య యుగాల నాటి చరిత్రను పునరావృతం చేసి, ప్రజలను చీకటి యుగంలోకి నెట్టే ఆటవిక చర్య లను వేగవంతం చేయడానికి బలమైన దేశాలు కంకణం కట్టుకున్న చందంగా నేటి ప్రపంచ పరిస్థితులు అగుపిస్తు న్నాయి. యుద్ధాలతో ప్రపంచాన్ని భస్మీపటలం చేసే ఉన్మాద చర్యలకు సామ్రాజ్యవాద శక్తులుప్రయత్నించడం బాధ్యతారాహిత్యం. తైవాన్పై డ్రాగన్ దేశం దాడిచేసి, ఆక్ర మించుకోబోతుందనే వార్తలు పతాక శీర్షికల్లో ప్రచురింపబ డుతున్నాయి. అన్ని సమాచార, ప్రసార, ప్రచార, సాంఘిక మాధ్యమాల్లో తైవాన్ పేరు మారుమోగిపోవడం చూస్తు న్నాం. ఒక సమస్య తరువాత మరొక సమస్య ప్రపంచ దేశా లను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక వైపు ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మాట యుద్ధం ఏ క్షణంలోనైనా భారీ యుద్ధానికి దారితీసే పరి స్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలను వణికి స్తున్న మరో సంఘర్షణకు చైనాతెరతీసింది. తైవాన్పై(Taiwan) దాడికి తెగబడుతున్నది. తూర్పు ఆసియాలో వాయవ్య పసిఫిక్ మహా సముద్రంలో భూసరిహద్దులు లేని ద్వీప దేశమైన తైవానన్ను ఆక్రమించుకుని, పీపుల్స్ రిపబ్లిక్ఆఫ్ చైనాలో విలీనం చేసితూర్పు ఆసియాలో తిరుగులేని శక్తిగా ఎదగా లని చేసేప్రయత్నంలో భాగమే చైనా చేపట్టిన ‘జస్టిస్ మిషన్’ ప్రధానోద్దేశ్యంగా భావించాలి. జస్టిస్ మిషన్ పేరుతో చైనా ఇప్పటికే తైవాను చుట్టిముట్టింది. ఈ నేపథ్యంలో తైవాన్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాను ఆయుధాల సర ఫరా వేగవంతం చేయాలని అమెరికా సెనేట్ కోరింది. ఇప్ప టికే తైవాన్ తన దేశ రక్షణకోసం 3.5 లక్షల కోట్లు కేటాయించింది. తైవాన్ చైనాలో అంతర్భాగ మని, తైవానన్ను ఆక్రమిం చుకుంటామని జిన్ పింగ్ హెచ్చరించగా, ప్రజాస్వామ్య దేశ మైన తైవాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్లి ప్రకటించడమే కాకుండా, ఇందుకు అమెరికా సహాయాన్ని అర్ధించడం కూడా జరిగింది. దక్షిణ కొరియా, జపాన్ వంటి పలు దేశాలు తైవాన్క అండగా నిలబడే అవకాశాలున్నాయి.
Read Also : Russia: ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

అమెరికా జోక్యం ఎందుకు?
అమెరికా అంతర్జాతీయ చట్టాల కు విరుద్ధంగా వెనిజులాపై దాడిచేసి ఆ దేశ అధ్యక్షుడైన నికోలస్ మదురోను నిర్బంధించిన తర్వాత తాము కూడా తైవానన్ను ఆక్రమించుకుంటే తప్పేంటనే ఆలోచన చైనాలో అంకురించింది. తైవాన్ అంశం చిలికి చిలికి గాలివానలా మారి పెనుయుద్ధానికి దారితీసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇప్పటికే తైవాన్ జలసంధి చుట్టూ చైనా వందలాది యుద్ధ విమానాలను, పదుల సంఖ్యలో యుద్ధనౌకలను మోహరిం చినట్టు వార్తలు వెలువడ్డాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక, నౌకా వైమానిక విన్యాసాలు చేయడం పట్ల అమెరికా అభ్యం తరం చెబుతూ ఈ చర్యను ఖండించింది. తైవాన్ భూతల, గగనతలాల్లో చైనా యుద్ధ విన్యాసాలు చేస్తున్నది. అసలు ఈ పరిస్థితులు ఏర్పడడానికి కారణమేమిటి? తైవానన్ను తన దేశ అంతర్భాగంగా చైనా పేర్కొనడానికి కారణమేమి టి?తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ఎందుకు భావిస్తున్నది? చైనా తైవాన్ మధ్యలో అమెరికా ఎందుకుజోక్యం చేసుకుంటున్నదనే విషయాలపై అవగాహన కలగాలంటే చరిత్ర పుటలను తిరగేయాలి. అప్పట్లో చైనాలో చెలరేగిన అంతర్యుద్ధంలో చైనా ప్రధాన భూభాగంపై కమ్యూనిస్టులు పట్టుసాధించారు. 1949లో చైనాలోని కువో మింటాంగ్ ప్రభుత్వం పతనంతో మావో జెడాంగ్ నేతృత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. మావో చేతికి చైనా అధి కారపగ్గాలు రావడంతో సివిల్వార్లో ఓడిపోయినసైనికులు, నాయకులు, వ్యాపారులు, లక్షలాది మంది ప్రజలు తైవాన్ కు పలాయనం చిత్తగించి, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు శాంతి, సామరస్యాలతో మనుగడ సాగిస్తున్నారు. చైనా ప్రధాన భూభాగం’పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పి.ఆర్.సి)గాను, తైవాన్ ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (ఆర్.ఓ.సి) గాను పిలువబడుతున్నది. 1949నుండి 1975వరకు చియాంగ్ కై షేక్ ఆధ్వర్యంలో తైవాన్ గణ నీయమైన ప్రగతి సాధించింది. అతని మరణానంతరం కూడా తైవాన్ అనేక రంగాల్లో ముందంజలో దూసుకు పోవడం గమనార్హం.
ఆక్రమణకు రంగం సిద్ధం
నేడు ప్రపంచంలో తైవాన్ అత్యంత బల మైన ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లో 20వ స్థానంలో ఉంది. వన్ చైనా పాలసీ ప్రకారం తైవాన్ను ఏ దేశమూ స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు. తైవాన్కు సంబంధించిన విషయా లను చైనాతో మాత్రమే అధికారికంగా సంప్రదించాలి. అమెరికా చైనాల మధ్య 1972,1979,1982వ సంవత్సరాల్లో మూడు కమ్యూనిక్ ఒప్పందాలు కుదిరాయి. వన్ చైనా పాలసీని ఉల్ల ఘించి, తైవాన్కు అమెరికా ఆయుధాలను సరఫరా చేయడం, ప్రత్యక్ష ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల, త్రీ కమ్యూ నిక్స్’ను ఉల్లంఘించడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం చెబు తున్నది. తైవాన్ స్వతంత్రంగా వ్యవహరించడం తమకు ముప్పుగా భావించిన చైనా తాజాగా తైవాన్ ఆక్రమణకు రంగం సిద్ధం చేసింది. చైనా ప్రధాన భూభాగం నుండి దక్షిణ సముద్ర తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ దేశం ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యత గలదేశం. పసిఫిక్ మహాసముద్రంలో తైవాను చైనా ప్రధాన భూభాగం నుండి వేరు చేసే ‘తైవాన్ (Taiwan) స్టయిట్ చైనా తైవాన్ల మధ్య ఉద్రిక్తతలకు కారణం. ఈశాన్యంలో తూర్పు చైనా, నైరుతిలో దక్షిణ చైనా సముద్రాలను కలిపే తైవాన్ జలసంధి ప్రస్తుతం రణరంగంగా మారింది. బలమైన చైనాతో కలవ కుండా, తైవాన్ ప్రజలు స్వతంత్ర జీవనం సాగించడానికే ఇష్టపడతారు. చైనా ప్రభుత్వ పోకడలను, చైనా సామ్రాజ్య వాదాన్ని తైవాన్ ప్రజలు అంగీకరించడం లేదు. చైనాలో కమ్యూనిస్టు పాలన వాస్తవంగా నియంతృత్వ పునాదులపై ఆధారపడి కొనసాగుతున్నది. స్వేచ్ఛపై అనేక పరిమితులుం టాయి. చైనా ప్రభుత్వ రహస్యాలు బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా పత్రికా వ్యవస్థపై ఉక్కుపాదం మోపడం జరుగుతున్నది.

తైవాన్కు మద్దతు
చైనా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినా, ప్రపంచంలో అమెరికా తర్వాత బలమైన ఆర్థిక శక్తిగా అవ తరించినా ప్రజాభిప్రాయానికి విలువ లేకపోవడం, స్వేచ్ఛను అణగద్రొక్కడం లాంటి చర్యలతో చైనా పట్ల పలు ప్రపంచ దేశాలకు సానుకూల దృక్పథంలేదు. మావో జెడాంగ్ నుండి జిన్పింగ్ వరకు చైనా నియంతృత్వ దేశంగానే పరిగణించబ డుతున్నది. వ్యూహాత్మక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక, రక్షణ ప్రయోజనాల రీత్యా తైవాన్ చైనాకు ఎంతో ప్రాధాన్యత గల ద్వీపం. తైవాన్తో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని, ఆసియాలో సైనిక మనుగడ సాగించాలని కలలుకంటున్న అమెరికాను నిలువరించడానికి తైపీపై యుద్ధానికి బీజింగ్ సన్నద్ధమవుతున్నది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు చైనాకు వ్యతిరేకంగా తైవాన్కు మద్దతు పలకడం చైనాకు ఆగ్రహం కలిగించింది. తైవాన్ ప్రజలు సుభి క్షంగా జీవిస్తున్న తరుణంలో చైనా సైనిక చర్యకు పూనుకోవాలనుకోవడం తూర్పు ఆసియాలో అశాంతికి ఆజ్యంపోసినట్టే కాగలదు. 2.3కోట్ల జనాభా గల తైవాన్ పై141 కోట్ల జనాభా కలిగి, బలమైన ఆర్థిక, ఆయుధ
సామర్థ్యం గల చైనా యు ద్ధానికి సిద్ధపడడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే నన్న అభిప్రాయం కూడాఏర్పడింది. తైవాన్ ను ఒక దేశంగా కాకుండా ఒక పావిన్స్ గానే చైనా పరిగణిస్తున్నది. తైవాన్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తైవాన్ రక్షణ సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ముమ్మరం గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తైవాన్ చిన్న దేశమే అయినా పలురంగాల్లో బాగా అభివృద్ధిచెందిన దేశం. ఐక్య రాజ్య సమితి గుర్తించకపోయినా ఆర్థికబలం, ఆయుధ బలంతోపాటుగా పలు అంశాల్లో తైవాన్ తనప్రత్యేకతను ప్రపంచా నికి నిరూపించుకుంది. చైనా నిరంకుశత్వాన్ని నిరసిస్తూ, విస్త రణవాదంతో కాకుండా ప్రజాస్వామ్యవాదంతో పని చేయా లని చెబుతున్నా, తైవాన్పైచైనా కోపంతో రగిలిపోతున్నది. తైవాన్పై చైనా దాడికి తెగబడితే పలుదేశాలు అండగా నిల బడతాయని పూర్తిగా నిర్ధారణకు రాలేము. తైవాన్ తనకుతాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ, అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టబద్ధమైన స్వయంపాలనకొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ తైవాన్ను ప్రపంచ దేశాలు పూర్తిస్థాయిలో గుర్తించ లేదు. కేవలం 12దేశాలు మాత్రమే తైవాన్రెనికిని గుర్తించా యి. ఇప్పటికైనా తైవాను చైనా ప్రత్యేకదేశంగా గుర్తించాలి.ఇలాంటి అభివృద్ధి చెందుతున్న, ఉత్తమ ప్రజాస్వామ్య దేశమైన తైవాన్ అస్థిత్వాన్ని కాపాడాలి.
-సుంకవల్లి సత్తిరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: