భారతదేశం మరో కీలకమైన ఘట్టానికి సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రాబోతున్న ఈ కేంద్ర బడ్జెట్ (Budget 2026) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగం (Healthcare Sector) ఈసారి బడ్జెట్ నుండి విప్లవాత్మక మార్పులను కోరుకుంటోంది. కేవలం ఆసుపత్రులు కట్టడమే కాకుండా, పేషెంట్లకు సులభంగా అలాగే తక్కువ ధరకే వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిర్ధారణే కీలకం (Prevention is Better Than Cure).. చాలా సందర్భాల్లో రోగం ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాపాయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. అందుకే ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో వ్యాధి నివారణ (Prevention)తో పాటు ముందస్తు నిర్ధారణ (Early Diagnosis) పరీక్షలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాలని ఆరోగ్య రంగ నిపుణులు కోరుతున్నారు.
Read Also: GST: వ్యాపారులు వీటి గురించి తప్పక తెలుసులోవాలి

సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గేనా?
నేటికీ మధ్యతరగతి కుటుంబాలు తమ పొదుపు మొత్తంలో ఎక్కువ భాగాన్ని వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే కొత్త మందులు, అత్యాధునిక చికిత్సలు భారతీయులకు తక్కువ ధరకే అందుబాటులోకి రావాలంటే పటిష్టమైన విధానాలు అవసరం. ఈసారి బడ్జెట్ లో పరిశోధనలు (R&D), ఆవిష్కరణలకు ఊతం ఇస్తే తప్ప, సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందడం కష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డిజిటల్ హెల్త్ సిస్టమ్స్, ప్లాస్మా థెరపీ వంటి రంగాలకు ప్రోత్సాహం ఇస్తే చిన్న పట్టణాల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుంది. హెల్త్ స్టార్టప్‌లకు చేయూత ఇప్పుడు AI (కృత్రిమ మేధ) ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇందులో హెల్త్ రిలేటెడ్ ఏఐ కంపెనీలకు చేయూతనిస్తే అది ఆరోగ్య రంగానికి మేలు చేసినట్టవుతుంది. ఏఐ హెల్త్ టెక్ కు సంబంధించిన భారతీయ స్టార్టప్‌లకు ప్రభుత్వం రాయితీలు, గ్రాంట్ల వంటివి ఇస్తే తక్కువ ఖర్చుతోనే ప్రజలకు ఆరోగ్య సూచనలు అందే అవకాశం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: