Vivo తన V70 సిరీస్ ఫోన్లను(Smart phone) త్వరలో విడుదల చేయబోతున్నట్లు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సిరీస్‌లో Vivo V70 FE 5G కూడా భాగమవుతుందని అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో Vivo V2550 మోడల్‌గా కనిపించిన ఈ ఫోన్, అధిక సామర్థ్యమైన 6,870mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 55W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 67 గంటల 21 నిమిషాల బ్యాటరీ బ్యాకప్ అందించగలదని అంచనా.
Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

5 ఏళ్ల అప్డేట్స్తో స్మార్ట్‌ఫోన్
ఫోన్లో IP68 రేటింగ్ ఉంది, దీని ద్వారా ధూళి, నీటి నుంచి రక్షణ ఉంటుంది. అలాగే, లెవల్ 4 స్క్రాచ్ రెసిస్టెన్స్, ఐదు సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌కు ప్రత్యేకంగా ఉన్నాయి. రిపేరబిలిటీకి ‘C’ రేటింగ్ లభించడం వలన ఫోన్ మరమ్మతుల సందర్భంలో కొంత కష్టంగా ఉండొచ్చని సూచన.
ఇంతేకాక, Vivo V70 FE 5G కొత్త డిజైన్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా సెటప్, 5G కనెక్టివిటీ మరియు బడ్జెట్-ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్ త్వరలో భారత్ మరియు యూరోప్ మార్కెట్లలో లాంచ్ కానుందనే అంచనాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: