హైదరాబాద్ (తార్నాక) : తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. దక్షిణ మధ్యరైల్యే. (South Central Railway) రైల్వే ప్రయాణికులకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ అమృత్ భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలును జనవరి 23 న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Minister Narendra Modi) ప్రారంభించనున్నారు. ఇప్పటికి చర్లపల్లి ముజఫర్ పూర్ ( భీహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. తిరువనంతపురం – చర్లపల్లి మధ్య నడిచే ఈ రైలు తెలంగాణకు కేటాయించిన రెండో అమృత్ భారత్ రైలు. ఈ రెలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చేరుతుంది. తిరిగి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరి తర్వాత రోజు రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరకుంటుంది.
Read also: AP: వైద్యవిద్యపరీక్షల నిర్వహణలో పారదర్శకత

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
ఆధునిక సదుపాయాలతో, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రైలును రూపొందించారు. (South Central Railway) మధ్యతరగతి, సాధారణ ప్రయాణికులకు అందుబాటు ధరల్లో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ రైలు ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భద్రత, సౌకర్యాలు పెరుగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు తెలంగాణలోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగనుంది. ముఖ్యంగా నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట తదితర స్టేషన్లలో ఈ రైలు నిలుస్తుందని అధికారులు తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులభం కానుందని, సాధారణ ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: