నేడు (శుక్రవారం) క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IND-NZ రెండో T20 మ్యాచ్, రాయ్‌పూర్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ గెలుపుతో, సిరీస్‌లో ఆధిక్యం సాధించగా, రెండో మ్యాచ్‌తో ఆ ఆధిక్యాన్ని మరింత బలపరచాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా సిరీస్‌లో నిలబడేందుకు ఈ మ్యాచ్‌ను కీలకంగా భావిస్తోంది.దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: Indonesian Masters: క్వార్టర్స్‌లోకి PV Sindhu
అక్షర్ పటేల్ కు గాయం
తొలి టీ20లో బౌలింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ రెండో టీ20 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. డారిల్ మిచెల్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అక్షర్ పటేల్ ఎడమచేతి చూపుడువేలికి గాయమైంది. బంతి బలంగా తాకడంతో రక్త స్రావమైంది. దాంతో మైదానం వీడిన అక్షర్ మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు.అతని గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

ముందస్తు చర్యల్లో భాగంగా తదుపరి కొన్ని మ్యాచ్‌లకు అక్షర్ పటేల్‌ను దూరంగా ఉంచే అవకాశం ఉంది. అదే జరిగితే అతని స్థానంలో కుల్దీప్ ఆడే ఛాన్సుంది. మరోవైపు వర్క్‌లోడ్ మానేజ్మెంట్ లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్‌కు అవకాశమివ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అతనొస్తే బ్యాటింగ్ పరంగానూ కొంత బలం పెరుగుతుంది అంటున్నారు. రా.7గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: